: అక్కడ అడుక్కునే వాడి సంపాదన గంటన్నరకు రూ.27,153
దుబాయ్ లో యాచకవృత్తి కొనసాగించేవారి సంపాదన రోజుకు సుమారు 9,000 దినార్లు ఉంటుందట. గంటన్నరలో 1500 దినార్లు (రూ.27,153) సంపాదించేస్తున్నారట. ఈ విషయాన్ని అక్కడి అధికారులు తాజాగా వెల్లడించారు. యాచకవృత్తిని నేరంగా పరిగణించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో అధికారులకు చిక్కకుండా బెగ్గర్లు తమ పనితాము తాము కానిచ్చేస్తున్నారు. అలాంటి వాళ్లను పట్టుకునే క్రమంలో అక్కడి పోలీసు అధికారులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 59 మంది యాచకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సదరు అధికారులు మాట్లాడుతూ.. తాము అరెస్టు చేసిన ఓ బెగ్గర్ దగ్గర ఏకంగా 270,000 దినార్లు (రూ.48,87,702) ఉన్నాయని వెల్లడించారు. దుబాయ్ లో వీరి సంపాదన రోజుకి 9,000 దినార్లు ఉంటుందని, గంటన్నరలో 1500 (రూ.27,153)దినార్లు సంపాదిస్తున్నారని ఆశ్చర్యాన్ని కలిగించే లెక్కలు చెప్పారు. కాగా, దుబాయ్‌లో యాచకులు లేకుండా చేస్తామని పోలీసులు చెప్తున్నారు.