: పీకల్లోతు కష్టాల్లోకి వైకాపా... బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు కూడా జంప్!
వైఎస్ జగన్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయింపులు ఆగేలా లేవు. తాజాగా ఆ పార్టీకి చెందిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఉదయం ఆయన స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరాలని అనుకుంటున్నానని వెల్లడించిన ఆయన, నేతల అభిప్రాయాలను కోరారు. త్వరలోనే తాను కూడా వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలోకి వస్తానని ఆయన తెలిపినట్టు సమాచారం. తనతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు సైతం పార్టీ మారుతారని రంగారావు చెప్పారట. కాగా, ఇప్పటికే 11 మంది వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరి ఆ పార్టీని కష్టాల్లోకి నెట్టేయగా, తాజా ఫిరాయింపుల వార్తలతో ఆ పార్టీ పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లినట్లయింది. ఇక త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో సైతం వైకాపా ఒక సీటును గెలుచుకునే అవకాశాలూ అడుగంటుతున్నాయి.