: సొంత ఇలాకాకే కరుణ ఓటు!... ఈ దఫా కూడా తిరువారూర్ నుంచే పోటీ!


డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోసారి తమిళ సీఎం పదవి చేపట్టి రికార్డు నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే మొగ్గుచూపారు. చాలాకాలం నుంచి వీల్ చైర్ కే పరిమితమైన కరుణానిధి... ఇటీవలి కాలంలో మరింత నీరసించారు. అయితే అరుదైన రికార్డు నెలకొల్పేందుకు ఈ దఫా ఎన్నికల బరిలోకి దిగేందుకే ఆయన నిర్ణయించుకున్నారు. ఇప్పటిదాకా తనను గెలిపిస్తూ వస్తున్న తిరువారూర్ నియోజకవర్గం నుంచే ఈ దఫా కూడా పోటీ చేయాలని ఆయన దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఈ నెల 23న సైదాపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న కరుణ... 25న తిరువారూర్ లో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికీ డీఎంకే తన పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించకున్నా, కరుణ మాత్రం తన సొంత నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కరుణ నామినేషన్ కు జరుగుతున్న ఏర్పాట్లే ఇందుకు నిదర్శనంగా వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News