: తెలంగాణ అంటే నాకిష్టం...ఇక్కడే ఎక్కువ మంది ఫ్రెండ్స్ వున్నారు!: పవన్ కల్యాణ్
తెలంగాణ అంటే తనకు ఇష్టమని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోనే తాను ఎక్కువగా పెరిగానని, ఇక్కడి యాస, సంస్కృతిపై తనకు పట్టు ఉందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల రెండు సంస్కృతులు విభిన్నమైనవని, అవి కలవలేదనిపించిందని అన్నారు. తెలంగాణ నుంచే తనకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారన్నారు. తన చిత్రాల్లో తెలంగాణ యాసకు ప్రాధాన్యమిచ్చానని, పాటల ద్వారా కొందరిని ప్రోత్సహించానని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన గురించి కూడా పవన్ మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో ఎటువంటి ద్వేషం లేదని, చాలా స్పృహతోనే విభజన జరిగిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ విజయవంతంగా నడిపించారంటూ ఆయన ప్రశంసించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి, భూమికి గౌరవం ఇవ్వడం తనకు బాగా నచ్చిందని పవన్ పేర్కొన్నారు.