: నా పరిధిని మించిన పాత్రలు చేయడం నా వల్ల కాదు: పవన్ కల్యాణ్
చాలా మంది యాక్టర్లు వాళ్ల పరిధిని మించిన పాత్రలు, వాళ్లకు తగని పాత్రలు చేస్తారని, అది తన వల్ల మాత్రం కాదని పవన్ కల్యాణ్ అన్నాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆనందంగా ఉండాలని చెప్పడానికి డ్యాన్స్ చేస్తాము తప్పా, ఏదో ఒక డ్రిల్ లా చేయాలంటే మాత్రం కష్టమన్నాడు. అలా చేసే స్కిల్స్ కొంతమందికి ఉంటాయని, ఆ స్కిల్ తనకు మాత్రం లేదని అన్నాడు. యాక్టింగ్ అనేది తనకు సహజంగా వచ్చింది కాదని, అందుకే తన పరిమితుల్లోనే తాను యాక్టు చేస్తానని చెప్పాడు. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కోసం తాను ఏదైతే అనుకున్నానో అదే చేశానని, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని అన్నాడు. తెలుగు సినిమా స్థాయి ఇంకా పెరగాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ అన్నాడు.