: ఎన్ఐఏ అధికారి తాంజిల్ అహ్మద్ హత్య కేసులో నిందితుల అరెస్టులు
ఉత్తరప్రదేశ్ లోని షాహన్ పూర్ లో వివాహానికి హాజరై వస్తున్న ఎన్ఐఏ అధికారి తాంజిల్ అహ్మద్ హత్య ఘటన సూత్రధారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కేసు విషయంలో తనకు సహాయం చేయాల్సిందిగా రియాన్ అనే వ్యక్తి తాంజిల్ అహ్మద్ ను కోరాడు. దానికి తాంజిల్ అహ్మద్ అంగీకరించకపోవడంతో రియాన్ అతనిపై ద్వేషం పెంచుకుని అతనిని ఎలాగైనా అంతమొందిచాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో వివాహానికి హాజరై ఇంటికి వెళ్తున్న తాంజిల్ అహ్మద్ ను స్నేహితుడు మునీర్ తో కలిసి పథకం ప్రకారం హత్య చేశాడు. రియాన్ ద్విచక్రవాహనం నడపగా, మునీర్ ఆయనపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తాంజిల్ అహ్మద్ ప్రాణాలు కోల్పోగా, ఆయన భార్యకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ కేసులో రియాన్, అతని తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ప్రధాన నిందితుడు మునీర్ పరారీలో ఉన్నాడు.