: ఏడేళ్ల చిన్నారిపై ఘాతుకానికి ఒడిగట్టిన కసాయికి మరణశిక్ష
మామిడి పండ్లు ఇస్తానంటూ నమ్మబలికి తనతో తీసుకెళ్లి ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ మధురయాదవ్ అనే వ్యక్తికి ఝార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. మధుర యాదవ్‌కు సహకరించిన అతని తండ్రికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నిందితుడు మధురయాదవ్ 2011లో ఓ ఏడేళ్ల చిన్నారికి మామిడి పళ్లు ఇస్తానని నమ్మబలికి తనతో తీసుకెళ్లాడు. అనంతరం చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టిన ఝార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లా కోర్టు నిందితునికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.