: బస్సు కండక్టర్ టూ పద్మవిభూషణ్.. రజనీకాంత్ పై ప్రశంసల వర్షం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, సినీ నటి రాధిక, సంగీత దర్శకుడు అనిరుథ్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు. ఆయా ట్వీట్లలో ఎవరేమన్నారంటే...‘పద్మ విభూషణ్ రజనీ’ అని పెద్ద కుమార్తె ఐశ్వర్యా ఆర్ ధనుష్, ‘స్టైల్ కింగ్, పద్మవిభూషణ్ రజనీకాంత్’ అని చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్, ‘కృషి, పట్టుదల, వినయంతో రజనీకాంత్ ఈ స్థాయికి ఎదిగారు’ అని అల్లుడు ధనుష్ ఆయా ట్వీట్లలో పేర్కొన్నారు. ‘ఇది ఎంతో గర్వించదగిన సమయం’ అని సినీ నటి రాధిక, ‘బస్సు కండక్టర్ నుంచి పద్మవిభూషణ్ పురస్కారం వరకు, అద్భుతాలు జరుగుతాయి’ అని సంగీత దర్శకుడు అనిరుథ్ తమ ట్వీట్లలో సంతోషం వ్యక్తం చేశారు.