: అంత అర్ధరాత్రి సల్మాన్ ని ధోనీ ఎందుకు కలిసుంటాడు?


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సతీసమేతంగా కలిశాడు. సాధారణంగా సల్మాన్ నివాసం నిత్యం అతిథులతో కళకళలాడుతుంటుంది. ఎక్కువగా కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు మక్కువ చూపే సల్మాన్ ఖాన్ ప్రతి సందర్భాన్ని పండగలా జరుపుకుంటాడు. నిన్న అర్ధరాత్రి సల్మాన్ నివాసానికి మహేంద్రసింగ్ ధోనీ, భార్య సాక్షి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ కుమార్తె పూర్ణ పటేల్ కూడా రావడం విశేషం. ధోనీ కారు సల్మాన్ ఇంటికి చేరగానే, ఎదురెళ్లి ధోనీని సల్మాన్ ఇంట్లోకి తీసుకెళ్లాడు. అయితే సల్మాన్ ను ధోనీ అంత అర్ధరాత్రి ఎందుకు కలవాల్సి వచ్చింది? అనే విషయాన్ని ఇద్దరూ వెల్లడించకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News