: న్యూఢిల్లీలో ప్రిన్స్ విలియమ్ దంపతులకు మోదీ విందు
భారత్ పర్యటనలో ఉన్న బ్రిటిష్ యువరాజు విలియమ్, ఆయన సతీమణి కేట్ మెడిల్టన్‌లతో ఢిల్లీలో నరేంద్రమోదీ సమావేశమయ్యారు. ప్రిన్స్ విలియమ్ దంపతులిద్దరికీ మోదీ విందు ఇవ్వనున్నారు. ఈ నెల 10 నుంచి ప్రిన్స్ విలియమ్ దంపతులు భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ వారిరువురికీ విందు ఇస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటనలో ఉన్న సమయంలో ప్రిన్స్ విలియమ్, కేట్ లు బంకింగ్ హామ్ ప్యాలెస్ లో ఆయనకు విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిరువురు ఈ నెల 16వ తేదీన తాజ్‌మహల్‌ను దర్శించనున్నారు. ఈ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.