: యాపిల్ ఆఫర్... నెలకు రూ. 999 అద్దెతో ఐఫోన్ ఎస్ఈ


ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్. ఈ సంస్థ విడుదల చేసే ఫోన్ల ఖరీదు, అవే స్పెసిఫికేషన్స్ తో లభించే మిగతా ఫోన్లతో పోలిస్తే రెట్టింపు నుంచి మూడు రెట్ల వరకూ అధికంగా ఉంటుంది. ఇక యాపిల్ స్మార్ట్ ఫోన్లు ఆకర్షిస్తున్నా, వాటిని సొంతం చేసుకోవాలంటే మాత్రం మధ్య తరగతికి సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తన ఫోన్లను అద్దెకు ఇస్తామని యాపిల్ సరికొత్త ప్రతిపాదన చేసింది. భారత కార్పొరేట్లు తాజా ఐఫోన్ ఎస్ఈ వేరియంట్ లను అద్దెకు తీసుకోవచ్చని, నెలకు రూ. 999ల అద్దెపై రెండేళ్ల పాటు వీటిని లీజుకు ఇస్తామని తెలిపింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ రకాలు అద్దెకు తీసుకోవాలంటే నెలకు రూ. 1,199, రూ. 1,399 అద్దెను చెల్లించాల్సి వుంటుందని తెలిపింది. ఈ మేరకు నేటి ఉదయం దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ దినపత్రికల్లో యాపిల్ వ్యాపార ప్రకటనలు ఇచ్చింది.

  • Loading...

More Telugu News