: భివాండి అగ్నిప్రమాదం: 25మందిని కాపాడిన రెస్క్యూటీమ్
ముంబయి శివారులోని థానే జిల్లా భివాండిలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న 80 మందిలో ఇప్పటివరకు 25 మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న వస్త్ర పరిశ్రమ ఉన్న నాలుగు అంతస్తుల భవనంలోకి మంటలు వ్యాపించాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి కార్మికులు కిటికీల ద్వారా బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.