: గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని కూడా జంప్..?


తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానికి సైతం తెలుగుదేశం వర్గాలు గాలం వేశాయా? త్వరలోనే ఆయన వైకాపాను వదిలి టీడీపీలోకి జంప్ చేయనున్నారా? తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలో కొడాలి నాని ఫిరాయింపుపై పెద్ద చర్చే జరుగుతోంది. గతంలో నాని తొందరపడి పార్టీని వీడారని, మారిన పరిణామాల నేపథ్యంలో ఆయన వైకాపాను వీడవచ్చని కథనాలు వస్తున్నాయి. కొడాలి నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయకుండా ఉన్నట్లయితే, ఇప్పుడు గుడివాడ ప్రాంతంలో నానికి తిరుగులేని ఆధిపత్యం ఉండి వుండేదని కృష్ణా జిల్లా రాజకీయ పరిశీలకులు గతంలోనే వ్యాఖ్యానించారు. నాని తెలుగుదేశం పార్టీలో చేరుతానంటే, తాము తప్పక ఆహ్వానిస్తామని కొందరు తెలుగుదేశం మంత్రులు ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇక నాని మనసులో ఏముందన్న విషయం మాత్రమే తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News