: సార్! ఏ గెటప్ వేసినా అంత అందంగా కనిపిస్తారు... ఇలా ఎలా సాధ్యం?: సూర్యను అడిగిన అఖిల్
'గజని' సినిమా చూసిన దగ్గర్నుంచి సూర్యకు అభిమానిగా మారానని యువ నటుడు అఖిల్ అక్కినేని తెలిపాడు. '24' ఆడియో వేడుకలో మాట్లాడుతూ, సూర్యలో అద్భుతమైన లక్షణాలు ఎన్నో ఉన్నాయని చెప్పాడు. ఈ సందర్భంగా 'సార్! ఇప్పుడు తెరమీద ఏడు గెటప్పుల్లో మిమ్మల్ని చూశాను...ప్రతి గెటప్ లో డిఫరెంట్ గా, అంత అందంగా కనిపించడం ఎలా సాధ్యమైంది?' అని అఖిల్ అడిగాడు. 'నా తదుపరి సినిమా ప్రారంభమైనప్పుడు మీ దగ్గరికి వస్తాను, కాస్త టిప్స్ చెప్పండి సార్' అని అడిగాడు. దీంతో సూర్య 'అలాగే చెబుతా'నని అన్నాడు. విక్రమ్ కుమార్ జీనియస్ అని అఖిల్ ప్రశంసించాడు. 'మనం' సినిమా ద్వారా సమంతతో తన సినీ అరంగేట్రం జరిగిందని అఖిల్ గుర్తు చేసుకున్నాడు. రెహమాన్ గురించి తాను మాట్లాడేందుకు సరిపోనని చెప్పాడు.