: పబ్ వ్యాపారంలోకి ఎంటరైన సినీ హీరో నవదీప్
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే టాలీవుడ్ హీరో నవదీప్ ఇప్పుడు వ్యాపారంలోకి దిగాడు. హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఓ పబ్ ను ఓపెన్ చేశాడు. ఈ పబ్ ద్వారా నవదీప్ ఆసక్తికర వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడని సినీ సహచరులు పేర్కొంటున్నారు. కాగా, 'బీట్స్ పర్ మినిట్' పేరుతో ఏర్పాటు చేసిన ఈ పబ్ లో పలువురు బిగ్ షాట్లు పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది.