: బ్రిటన్ రాకుమారుడు దోశ వేసిన వేళ!
బ్రిటన్ రాకుమారుడు విలియమ్ దోశ వేశారు. ఆ తర్వాత చక్కగా దానిని ఆరగించారు. వారం రోజుల పాటు భారత్ లో పర్యటిస్తున్న విలియమ్, కేట్ మిడిల్ టన్ దంపతులు రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముంబయిలో టెక్ రాకెట్ షిప్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువ పారిశ్రామిక వేత్తలు రూపొందించిన కొత్త వస్తువులతో డెమో కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రదర్శనకు ఉంచిన దోశమాటిక్ పై విలియమ్ సరదాగా దోశ వేశారు. కాగా, అంకుర పరిశ్రమలు, వ్యాపారాల్లో కొత్తగా ప్రవేశించి అభివృద్ధి పథంలో వెళ్తున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఎంపిక చేసి ఈ అవార్డులను అందజేస్తున్నారు. ఈ అవార్డులకు ఎంపికైన యువ వ్యాపారవేత్తలు యూకే ట్రిప్ కి వెళ్లే అవకాశం పొందుతారు. ఈ కార్యక్రమంలో మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్ర పాల్గొన్నారు