: 'సుజన' గ్రూపుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు


'సుజన' గ్రూపు సంస్థల్లో చోటుచేసుకున్న అవకతవకలపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 'సుజన' గ్రూపు సంస్థల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలంటూ వినోద్ కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ విచారణార్హం కాదని స్పష్టం చేసింది. దీనిపై సరైన న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పిటిషనర్ కు సుప్రీంకోర్టు సూచించింది. కాగా, వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ మారిషస్ బ్యాంకు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో 'సుజన'పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News