: నిన్న జూనియర్ ఎన్టీఆర్, నేడు తారకరత్న... కార్లకు ఫైన్!
'రూల్ ఈజ్ రూల్... రూల్ ఫర్ ఆల్'... ఎంత సెలబ్రిటీలైనా, మామూలు వ్యక్తులైనా నిబంధనలు పాటించాల్సిందే. గత వారంలో బ్లాక్ ఫిల్మ్ అమర్చిన గ్లాస్ విండో కారుతో ప్రయాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారుకు జరిమానా విధించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, నేడు తారకరత్న సైతం అదే విధమైన కారులో ప్రయాణిస్తుంటే, ఆపి జరిమానా విధించారు. ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఈ ఘటన జరిగింది. పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న వేళ, ఆ దారిలో వెళుతున్న తారకరత్న కారుకు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ స్టిక్కర్ ఉండటం చూసి, అప్పటికప్పుడు రూ. 700 జరిమానా విధించారు. అంతే కాదు, అక్కడే కారుకు ఉన్న ఫిల్మ్ స్టిక్కర్ ను తొలగించారు.