: దేవుడికేమైనా వినపడదనుకుంటున్నారా?... వాటిని నిషేధించండి: మాతా అమృతానందమయి
దేవుడికేమైనా చెవుడా?...దేవాలయాల్లో బాణసంచా ఎందుకు కాలుస్తారు? అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి ప్రశ్నించారు. ప్రతి ఏటా దేవాలయాల్లో కాలుస్తున్న బాణసంచా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఇంకెందరో గాయాలపాలవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణించాలని ఆమె సూచించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పారు. బాణసంచా కాల్చడం కేవలం మనుషుల ఆనందం కోసమని ఆమె స్పష్టం చేశారు. దేవాలయాల్లో బాణసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాలని ఆమె డిమాండ్ చేశారు. పుట్టింగల్ ఆలయ ఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా చూడాలని ఆమె కోరారు.