: పునర్జన్మించిన బాలుడిని గుర్తించిన దలైలామా... ఈ బాలుడిక రింపోచీ


డార్జిలింగ్ కు చెందిన 9 సంవత్సరాల బాలుడు పునర్జన్మించాడని దలైలామా గుర్తించారు. ఈ బాలుడిని ద్రాక్త్సీ లేదా బ్రాట్సీ రింపోచీగా గుర్తిస్తున్నట్టు దలైలామా కార్యాలయం నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడింది. డార్జిలింగ్ కు చెందిన పేమా వాంగ్డీ, సంజూ రాయ్ దంపతుల కుమారుడైన దవా వాంగ్డీ పునర్జన్మను రింపోచీల సీనియర్ గేషీ (ఉన్నతాధికారి) తాషీ త్సేతర్ కూడా స్పష్టం చేశారు. గతంలో రింపోచీలు అందరూ తవాంగ్ జిల్లాలోని మోన్పా వర్గంలోనే అత్యధికంగా జన్మించారు. ఇప్పుడు డార్జీలింగ్ లో రింపోచీ జన్మించడంతో జాంగ్, జాండ్గా, తింగు, మాగో, రోహో ప్రాంతాల్లోని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, నవంబర్ 1, 2004న మరణించిన ద్రాక్త్సీ తుప్తేన్ తెంపా గ్యాల్త్ సేన్ రింపోచీయే దవా వాంగ్డీగా జన్మించినట్టు టిబెటన్లు నమ్ముతున్నారు. కాగా, రింపోచీగా, దవా అధికారిక జన్మోత్సవం వచ్చే సంవత్సరం జరుగుతుందని లామా కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News