: హైదరాబాదులో కోర్టు ప్రాంగణంలో భార్య గొంతు కోసిన వ్యక్తి
హైదరాబాదులో న్యాయస్థానం ప్రాంగణంలో భార్యపై ఆమె భర్త హత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. లంగర్ హౌజ్ కు చెందిన నాగేందర్ బాబు, సౌజన్య దంపతులు ఏడాదిన్నర క్రితం విడాకుల కోసం రాజేంద్ర నగర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరికి పదేళ్ల క్రితం వివాహం కాగా, ఏడేళ్ల కుమారుడున్నాడు. వివాహం తరువాత ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, విడాకులు మంజూరు చేసి, తనకు, తన బిడ్డ పోషణ నిమిత్తం భరణం ఇచ్చేలా ఆదేశించాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసు విచారణకు వారిద్దరూ రాజేంద్రనగర్ న్యాయస్థానానికి వచ్చారు. వాయిదా అనంతరం తిరిగివెళ్తున్న సమయంలో నాగేందర్ బాబు తనతో తెచ్చుకున్న కత్తితో సౌజన్య గొంతు కోసి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.