: హైదరాబాద్ లో ఓ మాట, తుళ్లూరులో మరో మాట చెప్పే పవన్ మాటను ఎలా నమ్మాలి?: జ్యోతుల
సినిమా హీరో పవన్ కల్యాణ్ ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతూ ఉంటారని, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని నేడు వైకాపాను వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్న జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, హైదరాబాద్ లో ఒకలా, ఆపై తుళ్లూరుకు వచ్చి మరోలా మాట్లాడే ఆయన్ను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఆయన రాజకీయాల్లోకి వస్తానంటే స్వాగతిస్తామని, అయితే, పవన్ చెప్పే మాటలపై తనకు విశ్వాసం లేదని అన్నారు. నిన్న ఒక మాట చెప్పి, ఆపై రేపు తాను చెప్పినదానికే భిన్నంగా వ్యాఖ్యానించడం ఆయన నైజమని విమర్శించారు. ఆయన్ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.