: మంటల్లో కారు బుగ్గి!... అద్దాలు బద్దలుకొట్టుకుని బయటపడ్డ సీరియల్ హీరో నమీష్ తనేజా


హిందీ సీరియల్ లో హీరోగా నటిస్తున్న ఓ బుల్లి తెర నటుడు నిజ జీవితంలోనూ హీరోలాగే ప్రాణాపాయం నుంచి గట్టెక్కాడు. స్వరాగిణి, ఏక్ నయీ పెహ్ చాన్ తదితర సీరియళ్లలో లీడ్ రోల్స్ పోషించిన బుల్లి తెర నటుడు నమీష్ తనేజా ఈ సాహసం చేశాడు. ఇటీవల ముంబైలో తనకు ఎదురైన అనుభవాన్ని అతడు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికతో పంచుకున్నాడు. నేటి ఉదయం పలు ఆంగ్ల పత్రికల ఆన్ లైన్ ఎడిషన్లలో వెలుగుచూసిన ఈ కథనం ప్రకారం... కొత్తగా కొనుగోలు చేసిన కారులో తనేజా వెళుతుండగా పెట్రోల్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయి. అయితే క్షణాల్లోనే ప్రమాదాన్ని గమనించిన తనేజా... కారును ఆపేసి బయటకు వచ్చేందుకు యత్నించాడు. ఈ క్రమంలో కారు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఆన్ కావడంతో డోర్లు తెరచుకోలేదు. దీంతో ఏం చేయాలో తనేజాకు పాలుపోలేదు. అప్పటికే మంటల కారణంగా కారులో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. శ్వాస పీల్చడమే కష్టంగా మారిన క్రమంలో తనేజా సాహసం చేశాడు. కారు అద్దాలు బద్దలుకొట్టుకుని బయటకు వచ్చాడు. ఈ ఘటనలో తనేజాకు ఎలాంటి గాయాలు కాలేదు.

  • Loading...

More Telugu News