: అనంత్ అంబానీ ‘భారీ’ కసరత్తుకు కెప్టెన్ కూల్ ఫిదా!
మొన్నటిదాకా భారీకాయుడిగా కనిపించిన రియలన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ... ఇటీవల స్లిమ్ గా తయారయ్యాడు. నెల క్రితమే అతడు సన్నబడ్డాడని వార్తలు వచ్చినా, అతడు మాత్రం మొన్న రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా స్లిమ్ రూపంతో బయటకు వచ్చాడు. అతడిని చూసిన జనం ముక్కున వేలేసుకున్నారు. ఇతడు అనంత్ అంబానీనేనా? అంటూ అదో రకంగా చూశారు. తాను అనంత్ అంబానీనేనంటూ అతడు నేరుగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో ఫొటో దిగాడు. అదే క్రమంలో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ పక్కన కూడా నిలబడి ఓ ఫొటోకు పోజిచ్చాడు. ఈ సందర్భంగా తన భారీకాయాన్ని తగ్గించుకుని స్లిమ్ గా మారేందుకు ఏమేం చేశాడన్న విషయాన్ని అతడు ధోనీకి చెప్పాడట. ఆ వివరాలన్నింటిని సాంతం విన్న ధోనీ నిన్న... సదరు వివరాలను గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ లో అనంత్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు. తనతో స్లిమ్ అనంత్ దిగిన ఫొటోను పోస్ట్ చేసిన ధోనీ... అనంత్ కష్టపడ్డ తీరును గుర్తు చేసుకున్నాడు.