: కేసీఆర్ పై అదొక్కటే అసంతృప్తి!: పవన్ కల్యాణ్
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఓ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన ఓ విజన్ తో జాగ్రత్తగా వెళుతున్నారని అన్నారు. "ఒక్కోసారి నాకు ఇబ్బందిగా అనిపించేది ఏంటంటే, మిగతా పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకొని పోవడం... నిజంగా అది అంత అవసరం లేదుకదా? అనిపిస్తుంది. నాకు అదొక్కటే చంద్రశేఖరరావు ఆలోచనా విధానంపై అసంతృప్తి. బయట నేను ఎక్కడ వింటున్నాగానీ పాలన బాగుందనే అంటున్నారు. నేను ప్రత్యక్షంగా చూడలేదుగానీ, నాకు తెలిసింది. కాకపోతే, మిగతా అన్ని పార్టీల నుంచి వచ్చి చేరడం ... అది ఎంతవరకూ అడ్వాంటేజ్ అన్నది నాలో ఆలోచన పుట్టిస్తోంది. ఎందుకంటే... ఉద్యమ స్వరూపంతో వచ్చిన పార్టీ అది. అలాంటి పార్టీకి కూడా ఇలాంటి విధానాలు అవసరమా? ఈ వేరే పార్టీ ఎమ్మెల్యేలను తీసుకురావడాలు... వినూత్నంగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీకి ఇది అవసరం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం" అన్నారు.