: ఇక తెలంగాణ వంతు... నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం


ఏపీలోని రాయలసీమ, సెంట్రల్ ఆంధ్రా జిల్లాల పరిధిలో ఇటీవల పలు రైళ్లపై విరుచుకుపడ్డ దోపిడీ దొంగలు నానా బీభత్సం సృష్టించారు. తాజాగా సదరు దొంగలు తెలంగాణలోకి కూడా ఎంటరయ్యారు. ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు పరిధిలో నేటి తెల్లవారుజామున నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో చోరీ జరిగింది. అప్పటికే రైల్లోకి ఎక్కిన దొంగలు దెందుకూరు వద్దకు రాగానే చైన్ లాగి రైలును ఆపేసిన దొంగలు ఇద్దరు మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాగేశారు. ఆ తర్వాత వెనువెంటనే రైలు దిగేసి, క్షణాల్లో మాయమయ్యారు.

  • Loading...

More Telugu News