: ప్రతి హీరోలోనూ చిరంజీవి కనబడతారు!: అల్లు శిరీష్


ప్రముఖ నటుడు చిరంజీవి 150వ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, తాను కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానని అల్లు శిరీష్ తెలిపాడు. 'సరైనోడు' ఆడియో విజయోత్సవ వేడుకలో మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమలోని ప్రతి హీరోలోనూ చిరంజీవి కనబడతారని శిరీష్ చెప్పాడు. గత కొంతకాలంగా ఆయన నటించకపోయినా ఆయనను గుర్తు చేయడానికి తామంతా ఉన్నామని శిరీష్ చెప్పాడు. బన్నీ 'ఆర్య'తో తనకు మంచి స్నేహితుడు అయ్యాడని, 'దేశముదురు'తో మంచి అన్నయ్య అయ్యాడని, 'రేసు గుర్రం'తో గురువుగా మారాడని శిరీష్ చెప్పాడు. మెగా ఫ్యామిలీ హీరోయిన్ గా ముద్రపడిన రకుల్ ప్రీత్ ను చూస్తే గర్వంగా ఉందని శిరీష్ తెలిపాడు. మెగా ప్యామిలీ ట్యాగ్ కు న్యాయం చేసిందని రకుల్ ను కొనియాడాడు.

  • Loading...

More Telugu News