: అలీ ఏం మాట్లాడినా కామెడీగా ఉంటుది... మెగా ఫ్యాన్స్ మధ్య విభేదాలు లేవు!: పవన్ కల్యాణ్


తనను బయటి వాళ్లు ఏమని తిట్టుకుంటారో ఊహించి, సినిమాలో అలాంటివి అలీతో అనిపించుకుంటుంటానని పవన్ కల్యాణ్ అన్నాడు. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో, అలీతో నటిస్తే అలా ఉంటుందని ఆయన చెప్పాడు. అలీ ఏం మాట్లాడినా అది కామెడీగా ఉంటుందని పవన్ పేర్కొన్నాడు. మెగా ఫ్యాన్స్ అని, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అని తేడాలు, విభేదాలు లేవని పవన్ స్పష్టం చేశాడు. అన్నయ్యతో రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నాయి కానీ, ఆయనను వ్యతిరేకించేత అభిప్రాయ భేదాలు ఉండవని పవన్ స్పష్టం చేశాడు. ఎవరు ఏమనుకున్నప్పటికీ ఆయన తరువాతే తానని చెప్పాడు. అన్నయ్య స్థానం అన్నయ్యదేనని పవన్ తెలిపాడు. అభిమానుల్లో తనను ఇష్టపడే వారు ఉన్నప్పటికీ వారికి అన్నయ్య అంటే వ్యతిరేకత ఉండదని పవన్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News