: డాన్సు చేయమంటే ఏడుపు వచ్చేస్తుంది: పవన్ కల్యాణ్


తనకు ఏనాడూ నటుడవ్వాలన్న వ్యామోహం లేదని ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ చెప్పాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, తనను సెట్ లో డాన్సులు చేయమంటే ఏడుపు వచ్చేస్తుందని అన్నాడు. ఈ కుప్పిగంతులు ఏంటి? ఎందుకీ బాధలు అనిపిస్తుందని పవన్ కల్యాణ్ చెప్పాడు. ఐదు పాటలు, ఆరు పాటలు ఫార్ములాలు తనకు నచ్చవని అన్నాడు. తాను తెలుగు, హిందీ పాత సినిమాలు చూస్తుంటానని పవన్ కల్యాణ్ చెప్పాడు. ఇంగ్లీష్ సినిమాలు అయితే ఏ జానర్ అయినా చూస్తానని పవన్ కల్యాణ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News