: పాకిస్థాన్ లో భారీ భూకంపం...భారత్ లో పరుగులు తీసిన ప్రజలు
పాకిస్థాన్ లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. పాకిస్థాన్ లోని పెషావర్ కు 284 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. భారీ తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలు వణికిపోయాయి. పాక్ లో సంభవించిన భూకంపం ధాటికి జమ్మూకాశ్మీర్, ఢిల్లీ, నోయిడా, ఛండీగఢ్ వంటి పలు ప్రాంతాల్లో 1.5 నిమిషాల పాటు భూమి వణికిపోయింది. దీంతో ముందు జాగ్రత్తగా ఢిల్లీ మెట్రోను నిలిపివేశారు. శ్రీనగర్, ఢిల్లీ, నోయిడా, ఛండీగఢ్ లలో ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. కాగా, పాకిస్థాన్ భూకంప నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.