: రిపోర్టర్ చెంప ఛెళ్లుమనిపించిన హాలీవుడ్ నటి
ముంబైలో ఇటీవల బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఓ మీడియా ప్రతినిధి చెంప ఛెళ్లుమనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే కోవలో హాలీవుడ్ నటి క్రిస్టీన్ బెల్ ఓ మీడియా ప్రతినిధి చెంప ఛెళ్లుమనిపించింది. 'ది బాస్' సినిమా ప్రీమియర్ షోకు క్రిస్టీన్ బెల్ హాజరైంది. ఆమెతో 'ఎక్స్ క్లూజివ్' పేరిట కొన్ని ప్రశ్నలకైనా సమాధానాలు రాబడదామని ప్రయత్నించిన రిపోర్టర్ డోనెల్లీ ఆమె ఇబ్బందిని పట్టించుకోకుండా ప్రశ్నలు సంధించాడు. రెడ్ కార్పెట్ మీదున్న ఆమె, అతను ఇబ్బందికరంగా మైక్ పెడుతున్నప్పటికీ ఒకట్రెండు సార్లు అతను మైక్ పట్టుకునే విధానాన్ని సరిచేసింది. అయినా సరే ఆమెను, ఆమె ప్రయత్నాన్ని పట్టించుకోకుండా అతని పంథాలో అతను ప్రశ్నలు అడిగాడు. అయితే ఆమెను ఏ ప్రశ్న అడిగాడో కానీ సమాధానం చెప్పకుండా వెళ్లపోయే ప్రయత్నం చేసింది. ఇంతలో ఆమె చేయిపట్టి ఆపే ప్రయత్నం చేశాడు డోనెల్లీ. అంతే, ఆమెకు కోపం ముంచుకొచ్చింది. వెనక్కితిరిగి చెంప ఛెళ్లుమనిపించింది.పాపం ... రిపోర్టర్ ముఖం ఎర్రగా కందిపోయింది!