: వెంకయ్యనాయుడు నర్మగర్భవ్యాఖ్యలు టీడీపీ, బీజేపీ విభేదాలకు సంకేతాలా?


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన నర్మగర్భవ్యాఖ్యలు ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలను తేటతెల్లం చేస్తున్నట్టున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతకొంత కాలంగా ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు రేగుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కితే ఉపయోగం ఏముంటుంది? అని అన్నారు. ఏదయినా జరిగితే ఇంట్లో మాట్లాడుకోవాలని, అలా చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన సూచించారు. తానేం చెబుతున్నానో అర్థమవుతుందనుకుంటానని ఆయన చెప్పారు. కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం విమర్శలు చేసుకుంటే పనులు పూర్తికావని ఆయన స్పష్టం చేశారు. కేంద్రానికి రాష్ట్రం, రాష్ట్రానికి కేంద్రం సహాయ సహకారాలు అందించుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News