: బిల్ కలెక్టరుగా మారి రూ.70 వేలు వసూలు చేసిన తెరాస ఎమ్మెల్యే
చేర్యాల ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. స్వచ్ఛ చేర్యాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేళ, పంచాయతీకి రూ. 3.86 లక్షల మొండి బకాయి రావాల్సి వుందని తెలుసుకుని మండి పడ్డారు. ఆ వెంటనే బిల్ కలెక్టరు అవతారం ఎత్తి, ప్రజా ప్రతినిధులు, పోలీసులను వెంటబెట్టుకుని ఒక్కో దుకాణం వద్దకూ వెళ్లి పన్నులను చెల్లించాలని కోరారు. రెండు గంటల్లో రూ. 70 వేలకు పైగా పన్ను వసూలు చేశారు. పన్ను చెల్లింపులపై ఇబ్బందులు పెడుతున్న వారి షట్టర్లకు తాళాలు వేయించారు. మిగిలిన బకాయిలను సైతం తానే వసూలు చేసి పంచాయతీకి ఇస్తానని హామీ ఇచ్చారు.