: అశ్విన్ కు ఒకే ఓవర్ ఎందుకిచ్చారో?: అజింక్య రహానే
ఐపీఎల్ ప్రస్తుత సీజన్ తొలి పోరులో ముంబై బ్యాటింగ్ చేస్తున్న వేళ, రవిచంద్రన్ అశ్విన్ తో ఒక్క ఓవర్ మాత్రమే ఎందుకు వేయించారో తనకు తెలియదని, మ్యాచ్ హీరో అజింక్య రహానే వ్యాఖ్యానించాడు. ముంబై ఇన్నింగ్స్ 16వ ఓవర్లో బౌలింగుకు వచ్చిన అశ్విన్ 7 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ విషయంలో కెప్టెన్ ధోనీ మనసులో ఏం కారణముందో తనకు తెలియదని అన్నాడు. "కారణం కెప్టెన్ కు మాత్రమే తెలిసివుంటుంది. ఇదో వైవిధ్యమైన వికెట్. వెస్టిండీస్ తో మేము ఆడిన మ్యాచ్ వికెట్ కన్నా ఇది భిన్నంగా ఉంది" అని అశ్విన్ తెలిపాడు. ఫాస్ట్ బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తూ, ప్రత్యర్థులను నిలువరిస్తున్న వేళ, అశ్విన్ అవసరం లేకపోయిందని ధోనీ భావించాడేమోనని అన్నాడు.