: వైద్యులను వెంటబెట్టుకుని కేరళ బయలుదేరిన ప్రధాని


కేరళలోని పుట్టింగల్‌ ఆయలంలో ఈ తెల్లవారుఝామున జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 90కి చేరగా, బాధితులను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఆయన వెంట కాలిన గాయాలకు చికిత్సలు అందించడంలో నిష్ణాతులైన 15 మంది వైద్యులను కేరళకు తీసుకువస్తున్నారు. ఈ మధ్యాహ్నం కేరళ చేరుకునే ఆయన, పుట్టింగల్ ఆలయాన్ని సందర్శించనున్నారు. కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారికి కేంద్రం నుంచి రూ. 2 లక్షల పరిహారాన్ని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారంగా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 300 మందికి పైగా ప్రజలు కాలిన గాయాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రమాద అనంతర పరిస్థితులను సమీక్షించేందుకు ఈ మధ్యాహ్నం కేరళ మంత్రిమండలి ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆలయ నిర్వాహకులు, బాణసంచా లైసెన్స్ దారులపై కొల్లాం పోలీసులు కేసును నమోదు చేశారు.

  • Loading...

More Telugu News