: గడ్డుకాలంలో బ్రిటన్ ప్రధాని... రాజీనామాకు పెరుగుతున్న ఒత్తిడి!


బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమెరాన్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. మొసాక్ ఫోన్సెకా పత్రాల్లో ఆయన పేరుండటం, విదేశీ కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా ఆయన లాభం పొందారని వెల్లడి కావడంతో, కెమెరాన్ పై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. ఆయన తక్షణం రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన పదవిని వీడాలని రోడ్డెక్కి నిరసన చేస్తున్న ప్రజల సంఖ్య పెరుగుతోంది. మొత్తం వ్యవహారంపై దర్యాఫ్తు చేయించాలని సొంత పార్టీ సభ్యులు సైతం డిమాండ్ చేస్తున్నారు. కాగా, తాను ఓ విదేశీ కంపెనీలో వాటాలను విక్రయించి లాభం పొందానని ఆయన స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, సదరు కంపెనీలో వాటాలను తన తండ్రి కొనుగోలు చేశారని కెమెరాన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News