: శని సింగనాపూర్ కి పోటెత్తిన మహిళా భక్తులు!
శని సింగనాపూర్ లోని శనీశ్వరాలయంలోకి మహిళా భక్తులు పోటెత్తారు. శనీశ్వరాలయంలోకి మహిళా భక్తుల ప్రవేశంపై బాంబే హైకోర్టు నిషేధం ఎత్తివేసిన తరువాత వచ్చిన తొలి శనివారం కావడంతో నేడు శనిసింగనాపూర్ మహిళా భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తులు వచ్చి శనీశ్వరునికి పూజాధికాలు పూర్తిచేశారు. తెల్లవారు జాము నుంచే వేలాదిగా చేరుకున్న మహిళా భక్తులతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. భక్తులు పోటెత్తడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో మహిళలు శనీశ్వరునికి పూజలు చేసేందుకు వస్తున్న భక్తులను చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారని అధికారులు తెలిపారు. బాంబే హైకోర్టు ఆదేశాలకు ముందు గ్రామస్థులంతా మూకుమ్మడిగా భూమాతా బ్రిగేడ్ సభ్యులను అడ్డుకున్న సంగతి తెలిసిందే.