: భువనేశ్వర్ విమానాశ్రయంలోకి కోతి.. 12 గంటల పాటు రచ్చ రచ్చ!
ఓ కోతి విమానాశ్రయంలోకి ప్రవేశించి తన స్వభావాన్ని ప్రదర్శిస్తూ రచ్చ రచ్చ చేసింది. ఈ సంఘటనే ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగింది. విమానాశ్రయంలోకి ప్రవేశించిన కోతి ఏకంగా 12గంటలపాటు సిబ్బందికి ముచ్చెమటలు పట్టించింది. విమానాశ్రయంలో అల్లరల్లరి చేసింది. దాన్ని పట్టుకోవాలని చూసిన సిబ్బందికి సైతం దొరకకుండా పరుగులు పెట్టి, సిబ్బందినీ పరుగులు పెట్టించింది. చివరికి అటవీశాఖ అధికారులను పిలిపించారు. ట్రాంక్వలైజర్ ఇచ్చి కోతిని అదుపులోకి తెచ్చిన అటవీశాఖ అధికారులు.. దాన్ని పట్టుకొని చివరికి అటవీ ప్రాంతంలోకి తరలించారు.