: అజయ్ తో ఐశ్వర్య మళ్లీ జోడీ కడుతోంది
పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బాలీవుడ్ తార ఐశ్వర్యారాయ్ సినిమాలతో మళ్లీ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఐస్ నటిస్తోన్న ‘సరబ్‌జీత్’ సినిమాలో ఎర్రటి పంజాబీ డ్రస్‌లో దర్శనమిచ్చిన ఆమె లుక్‌కి ఫ్యాన్స్ మంత్రముగ్ధులైపోయారు. పన్నెండేళ్ల క్రితం అజయ్‌దేవ్ గణ్ తో కలసి నటించిన ఐశ్వర్య మరోసారి ఇప్పుడు ఓ సినిమాలో జతకట్టనుంది. అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కే 'బాద్‌షా హో’ చిత్రానికి ఆమె ఓకే చెప్పేసింది. మిలన్ లూథ్రియా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా పలువురు బాలీవుడ్ తారల పేర్లు వినిపించినా.. ఐశ్వర్యానే ఫైనల్ అయిందని టాక్.