: అమెరికాలో భారీ అగ్నిప్రమాదం... కాలి బూడిదైన మూడంతస్తుల అపార్ట్ మెంట్


అగ్రరాజ్యం అమెరికాలో కొద్దిసేపటి క్రితం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ దేశంలోని హిడెన్ రిట్జ్ ప్రాంతానికి చెందిన మూడంతస్తుల అపార్ట్ మెంట్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే క్షణాల్లో అగ్ని కీలలు అపార్ట్ మెంట్ మొత్తానికి వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే మేల్కొన్న అపార్ట్ మెంట్ వాసులు పరుగు పరుగున బయటకు వచ్చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో ఓ ఫైర్ ఫైటర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News