: దీదీకీ ‘అమ్మ’ తరహా పోటీనే!.. మమతా బెనర్జీపై హిజ్రా పోటీ!
తమిళ ప్రజలు ‘అమ్మ’గా పిలుచుకునే అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆమె పోటీ చేస్తున్న ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఓ వింత పోటీ ఎదురైన సంగతి తెలిసిందే. ఆర్కే నగర్ నియోజకవర్గ పరిధిలో పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న హిజ్రా దేవి, జయలలితపై పోటీకి సిద్ధమయ్యారు. ఇదే తరహా పోటీని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ఎదురు కానుంది. కోల్ కతాలోని భవానీ నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న దీదీ నిన్న నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి దీపా దాస్ మున్షీ, బీజేపీ అభ్యర్థిగా నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ లు బరిలోకి దిగుతున్నారు. ఇక లోక్ జనశక్తి పార్టీ తరఫున బాబీ హాల్డర్ అనే ఓ హిజ్రా బరిలోకి దిగుతున్నారు.