: తాలిబాన్ల గడ్డపై 'గజల్' శ్రీనివాస్
గజల్ కు తెలుగులో విశిష్ట స్థానం కల్పించి.. ఈ విలక్షణ సంగీత ప్రక్రియనే ఇంటిపేరుగా మలుచుకున్న గాయకుడు గజల్ శ్రీనివాస్. ఆయన ఇప్పుడు తన గానామృతాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో పంచనున్నారు. గజల్ శ్రీనివాస్ ఏప్రిల్ 25 నుంచి మే 1 వరకు ఆఫ్ఘన్ దేశవ్యాప్తంగా చేపట్టే శాంతియాత్రలో పాల్గొంటారు. మైవాండ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహించే పలు కచేరీల్లో శ్రీనివాస్ తన గళాన్ని వినిపిస్తారు. కాగా, గజల్ శ్రీనివాస్ రూపొందించిన ఉర్దూ గీత గుచ్ఛం 'రుబారూ'ను ఆఫ్ఘన్-భారత్ స్నేహ సౌహార్ద్రతకు అంకితం ఇవ్వనున్నారు.