: సీఎం పీఠం కోసం కెప్టెన్ కుస్తీలు!... భార్యతో కలిసి రహస్య యాగం!


తమిళనాట అసెంబ్లీ ఎన్నికల వేడి నానాటికీ తీవ్రమవుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో తమిళనాడు మారుమోగిపోతోంది. తమిళనాడు సీఎం పీఠం విషయంలో కింగ్ మేకర్ గా అవతరించిన డీఎండీకే అధినేత, సినిమాల్లో ‘కెప్టెన్’గా ఓ వెలుగు వెలిగిన విజయకాంత్... చిన్న పార్టీలతో జట్టు కట్టి సీఎం పోస్టును లక్ష్యం చేసుకుని బరిలోకి దిగారు. ఈ నిర్ణయంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడంతో ఆయన షాక్ కు గురయ్యారు. విజయకాంత్ భార్య ప్రేమలత మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కెప్టెన్ కుడిభుజంగా పేరుపడ్డ చంద్రకుమార్ పార్టీని వీడారు. ఈ క్రమంలో సీఎం పీఠం కోసం తాను చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడతాయోమేనన్న భయం విజయకాంత్ లో గూడుకట్టుంది. ఈ భయాందోళనలను శాంతింపజేసేందుకు ఆయన చేయని యత్నం అంటూ లేదు. ఈ క్రమంలో తంజావూరు, కేరళల నుంచి వేద పండితులను తీసుకువచ్చి తన ఇంటిలో రహస్య యాగం నిర్వహించారు. బుధవారం సాయంత్రానికి చెన్నై చేరుకున్న పండితులు ఓ స్టార్ హోటల్ లో బస చేశారు. బుధవారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా విజయకాంత్ ఇంటికి వెళ్లిన పండితులు ఆయనతో యాగం చేయించారు. ప్రభుత్వ పదవిలో విజయకాంత్ తొమ్మిదిన్నరేళ్లు మాత్రమే ఉంటారని గతంలో జ్యోతిష్యులు చెప్పారు. ఇప్పటికే ఐదేళ్లు ఎమ్మెల్యేగా, నాలుగున్నరేళ్లు ప్రతిపక్ష నేతగా ఆయన పదవిని అనుభవించారు. ఇక తనకు సీఎం యోగం ఉండదని భావించిన కెప్టెన్... మొన్న రాత్రి జరిగిన రహస్య యాగంలో తన సతీమణి ప్రేమలతను కూర్చోబెట్టారట. ఈ యాగంపై ప్రస్తుతం పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ చర్చను ఏమాత్రం పట్టించుకోని ప్రేమలత... యాగం పూర్తయిన తర్వాత సదరు యాగంలో ఉపయోగించిన కుంకుమ, విభూదిని పార్టీ నేతలకు పంపిణీ చేశారట.

  • Loading...

More Telugu News