: వైసీపీ నేతలు టీడీపీలోకి రావాలి: సునీల్‌కుమార్ పిలుపు
వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీ గూటికి చేరిన ఎమ్మెల్యే సునీల్‌కుమార్.. వైసీపీ నేతలు టీడీపీలోకి రావాలని పిలుపునిచ్చారు. విజయవాడలో ఈరోజు టీడీపీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు వైసీపీలో ఎన్నో అవమానాలు జరిగాయని అన్నారు. వాటి గురించి చెబితే ఇబ్బంది పడతారని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు టీడీపీలోకి రావాలని హితవు పలికారు. ప్రలోభాలకు లొంగి టీడీపీలో చేరుతున్నామని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. 'వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారంలోనే టీడీపీలో చేరే ఆలోచనతో చంద్రబాబుతో మాట్లాడా'నని చెప్పారు. చంద్రబాబు పిలిచిన వెంటనే తెలుగుదేశం పార్టీ గూటికి వస్తానని ఎమ్మెల్యేగా తాను గెలిచినప్పుడే చంద్రబాబుతో చెప్పినట్లు తెలిపారు.