: మందకొడిగా సాగిన ట్రేడింగ్ మెరిసిన స్మాల్, మిడ్ క్యాప్!
అటు కొనుగోళ్లు గానీ, ఇటు అమ్మకాలు గానీ సూచికలను ప్రభావితం చేసేంతగా నమోదు కాకపోవడంతో క్రితం ముగింపునకు అటూ ఇటుగా సాగిన సూచికలు చివరకు దాదాపు స్థిరంగా ముగిశాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 11.58 పాయింట్లు పడిపోయి 0.05 శాతం నష్టంతో 24,673.84 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 8.75 పాయింట్లు పెరిగి 0.12 శాతం లాభంతో 7,555.20 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.64 శాతం, స్మాల్ క్యాప్ 0.63 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 31 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్, టాటా పవర్, టెక్ మహీంద్రా, యస్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభపడగా, హీరో మోటోకార్ప్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇన్ ఫ్రాటెల్, హిందుస్థాన్ యూనీలివర్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,687 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,481 కంపెనీలు లాభాల్లోను, 1,043 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. గురువారం నాడు రూ. 93,52,147 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 93,80,671 కోట్లకు పెరిగింది.