: ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న‌యినా చేయ‌లేదు.. ఆన్‌లైన్‌లో బిపాసా, కరణ్‌ల శుభలేఖ వైర‌ల్‌


బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు, హీరో కరణ్ గ్రోవర్ సింగ్ త్వ‌రలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వ‌చ్చిన వార్త‌లు ఇప్పుడు శుభ‌లేఖలోకి ఎక్కేశాయి. దీనిపై ఈ స్టార్స్ ఇద్ద‌రూ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఆన్‌లైన్‌లో వీరి శుభ‌లేఖ మాత్రం వైర‌ల్ అయిపోతోంది. ఈనెల 30న వీరి వివాహం జరగనున్న‌ట్లు టాక్‌. శుభ‌లేఖ‌లో పేర్కొన్న ముహూర్తం ప్ర‌కారం ముంబయి లోవర్‌ పారెల్ లోని ఓ హోటల్‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నుంది. కాగా, 'పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటా' న‌ని ఇటీవల ఓ షోరూమ్ ఓపెనింగ్‌లో బిపాసా బ‌సు మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానమిచ్చిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News