: వారు హిందూస్థాన్‌లోనే పుట్టిపెరిగారు.. అలా నిన‌దించ‌క పోతే ద‌వ‌డ ప‌గల‌కొట్టండి: ఛత్తీస్‌గఢ్ మంత్రి బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్


త‌న మెడ‌పై క‌త్తిపెట్టినా 'భార‌త్ మాతాకీ జై' అన‌ను అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్య ఎన్నో వివాదాలు రేపుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై అనేక మంది ప్ర‌ముఖులు ప్ర‌తీరోజూ ఎన్నో ర‌కాలుగా వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ స్టేట్ మినిస్ట‌ర్‌ బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్ కూడా ఈ నినాదంపై మరో దుమారం రేపే వ్యాఖ్య చేశారు. ఓ బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. అలా నినదించ‌ని వారి దవడ పగలగొట్టండి అని స‌ల‌హా ఇచ్చేశారు. 'భార‌త్ మాతా కీ జై' అన‌బోనంటూ వ్యాఖ్య‌లు చేస్తున్న వారు హిందుస్థాన్‌లోనే పుట్టి పెరిగార‌ని, ఇక్కడి నీరు తాగుతున్నార‌ని అన్నారు. వారిని ఖననం చేసేది సైతం ఇక్క‌డి నేల‌లోనే అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News