: మోదీ ప్రాబల్యాన్ని పెంచేందుకు అమిత్ షా మాస్టర్ ప్లాన్!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రాబల్యాన్ని మరింతా పెంచేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టెక్ రూటు పట్టారు. ప్రజల చేతుల్లో అందునా యువత చేతుల్లో తప్పనిసరైపోయిన స్మార్ట్ ఫోన్లపై ఆయన కన్ను పడింది. పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు, మోదీ పేరు యువతలో నిత్యం వినిపించేందుకు ఆయన మాస్టర్ ప్లాన్ వేశారు. నరేంద్ర మోదీ పేరిట తయారైన మొబైల్ యాప్ 'నమో'ను దేశవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో లక్ష డౌన్ లోడ్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. 570 జిల్లాలుండగా, ప్రతి జిల్లాలో లక్ష ఫోన్లలో ఈ యాప్ ను చేర్చాలని, తద్వారా మోదీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మరింత సులువుగా వారికి తెలియజేయవచ్చని ఆయన భావిస్తున్నారు. , ఇండియాలోని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫ్లిప్ కార్ట్, ఉబెర్, వాట్స్ యాప్, ఫేస్ బుక్ వంటి కొన్ని మాత్రమే 5 కోట్లకు మించిన డౌన్ లోడ్లను నమోదు చేసుకుని ఉన్నాయి. ప్రస్తుతం నమో యాప్ 10 లక్షల వద్ద ఆగివుంది. దీన్ని అన్ని జిల్లాలకూ విస్తరించే దిశగా, అమిత్ షా వేసిన మాస్టర్ ప్లాస్ అమలైతే, ఈ యాప్ కూడా అంతే స్థాయిలో విజయవంతమవుతుంది. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది బీజేపీ కార్యకర్తలున్న నేపథ్యంలో, ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళితే, అనుకున్న లక్ష్యం చేరడం సులువని అమిత్ షా కోటరీ భావిస్తోంది.