: షూటింగ్ లో గాయపడిన ఐశ్వర్యా రాయ్!


తన తాజా చిత్రం షూటింగ్ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ గాయపడినట్టు తెలుస్తోంది. పంజాబ్ లోని ఓ గ్రామంలో షూటింగ్ జరుపుతుండగా, గతుకుల రోడ్డుపై ఆమె పరిగెత్తాల్సిన దృశ్యాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. పరిగెత్తుతుంటే, ఆమె కాళ్లకు ధరించిన శాండిల్స్ విరిగిపోయి కాలు జారి పడిందని, స్వల్ప గాయమైనా షూటింగ్ ఆగకూడదన్న భావనతో, చెప్పులు లేకుండానే చిత్రీకరణ పూర్తి చేసిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. వేరే చెప్పుల జత కోసం కూడా ఆమె ఎదురుచూడ లేదని, వృత్తి పట్ల తన నిబద్ధతను ఆమె మరోసారి చూపిందని పొగిడాయి.

  • Loading...

More Telugu News