: ఇది కోనసీమలా లేదు... కేరళ మాదిరి కనిపిస్తోంది: గాయని చిత్ర
తూర్పు గోదావరి జిల్లాకు తొలిసారిగా వచ్చిన సినీ నేపథ్య గాయని చిత్ర అక్కడి అందాలను చూసి అచ్చెరువొందారు. గలగలా పారుతున్న గోదావరి, నదీ పాయల మధ్య జనావాసాలు, గట్ల వెంబడి కొబ్బరిచెట్లు చూసిన ఆమెకు కేరళ గుర్తొచ్చిందట. కోనసీమ అందాలను చూస్తుంటే కేరళ గుర్తొస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ఇక్కడ జరుగుతున్న కోనసీమ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె, తాను తొలిసారి ఇక్కడికి వచ్చానని, పచ్చని వాతావరణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగించిందని ఆమె తెలిపారు. ప్రజలు తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇక్కడి పర్యాటక ప్రాంతాలన్నింటినీ చూసేందుకు మరోసారి వస్తానని వివరించారు.